Ramanaidu: సీఎం రాజమండ్రి పర్యటనకు మీడియాను అనుమతించకపోవడం దారుణం: రామానాయుడు

  • సీఎం జగన్ పై టీడీపీ ఎమ్మెల్యే ధ్వజం
  • మీడియాపై అణచివేతకు పాల్పడుతున్నారని ఆగ్రహం
  • జగన్ నిరంకుశ విధానాలపై న్యాయపోరాటం చేస్తామని వెల్లడి

టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. జగన్ కక్షపూరితంగా పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. సీఎం రాజమండ్రి పర్యటనకు మీడియాను అనుమతించకపోవడం దారుణమని విమర్శించారు. మీడియాను అణచివేతకు గురిచేస్తున్నారని ఆరోపించారు. సీఎం జగన్ నిరంకుశ విధానాలపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. అటు, దళిత నేతలను సైతం వైసీపీ ప్రభుత్వం అణచివేతకు గురిచేస్తోందని అన్నారు. మాజీ ఎంపీ హర్షకుమార్ పై తప్పుడు కేసులు బనాయించి జైల్లో పెట్టారని ఆరోపించారు. జగన్ తన సామాజిక వర్గానికే నామినేటెడ్ పదవులు ఇస్తున్నారని రామానాయుడు విమర్శించారు.

Ramanaidu
Jagan
Rajamandri
Media
Telugudesam
YSRCP
GV Harsha Kumar
  • Loading...

More Telugu News