Reuters: తమిళనాడు ప్రభుత్వంతో ‘కియా’ సంప్రదింపులు నిజమేనంటున్న ‘రాయిటర్స్’!

  • ‘కియా’ తరలింపు కథనానికి కట్టుబడి ఉన్నాం
  • ఏపీ నుంచి తరలించేందుకు చర్చలు జరుపుతోంది
  • ఢిల్లీ ఆటో ఎక్స్ పో సందర్భంగా ‘కియా ’ప్రతినిధులను కలిసిన ‘రాయిటర్స్’  

ఏపీలోని అనంతపురం నుంచి తమ పరిశ్రమ యూనిట్లు తమిళనాడుకు తరలిపోతున్నాయంటూ ‘రాయిటర్స్’ వార్త సంస్థ కథనాన్ని ‘కియా’ ఎండీ ఖండించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ‘రాయిటర్స్’ మరోమారు స్పందించింది. ‘కియా’ తరలింపు కథనానికి తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. తమిళనాడు ప్రభుత్వంతో ‘కియా’ సంప్రదింపులు జరిపిన మాట నిజమేనని స్పష్టం చేసింది. ఏపీ నుంచి బయటకు తరలించేందుకు ‘కియా’ చర్చలు జరుపుతోందని పేర్కొంది. ఢిల్లీ ఆటో ఎక్స్ పో సందర్భంగా కియా మోటార్స్ ప్రతినిధులను ‘రాయిటర్స్’ ప్రతినిధులు సంప్రదించినట్టు సమాచారం.




Reuters
News Agency
KIA Motors
Tamilnadu
  • Loading...

More Telugu News