Disha: 'దిశ'.. అమె ఎక్కడ? ఆమెకు ఏం జరిగింది? ఇదిగో అద్భుతమైన ట్రైలర్: యువ హీరో

  • తన పేరు 'దిశ' అంటోన్న హీరోయిన్‌
  • సినిమాపై అంచనాలు పెంచేస్తోన్న 'వలయం' ట్రైలర్
  • సస్పెన్స్ థ్రిల్లర్‌గా సినిమా

హిప్పీ బ్యూటీ దిగంగన హీరోయిన్‌గా సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటోన్న సినిమా 'వలయం'. ఈ సినిమా టీజర్‌ ను ఆ సినిమా బృందం ఈ రోజు విడుదల చేసింది. నా పేరు అరవింద్ అని కొత్త హీరో లక్ష్ హీరోయిన్‌ని పరిచయం చేసుకుంటూ చెప్పగా.. తన పేరు 'దిశ' అని హీరోయిన్ చెబుతుంది. ఈ డైలాగ్‌తో ఈ సినిమా ట్రైలర్ ప్రారంభమవుతుంది. 'ఆ తర్వాత ఎంతగా నచ్చావె పిల్లా' అని పాటను వినిపించారు.
        'దిశ! అమె ఎక్కడ? ఆమెకు ఏం జరిగింది? ఇదిగో అద్భుతమైన ట్రైలర్' అంటూ హీరో లక్ష్ ఈ సినిమా ట్రైలర్‌ను పోస్ట్ చేశాడు. కాగా, ఈ సినిమాను రమేష్ కడుముల రూపొందిస్తుండగా, శేఖర్ చంద్ర సంగీతం, రామకృష్ణ ఎస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చదలవాడ పద్మావతి ఈ సినిమాకు నిర్మాత. హీరో భార్య దిశ క‌న‌ప‌డ‌కుండా పోవడంతో ఆమెకు ల‌వ్ ఎఫైర్ ఉందని, ఆ కార‌ణంగా హీరోనే చంపేశాడ‌ని పోలీసులు భావిస్తారు.

  • Loading...

More Telugu News