badminton: బ్యాడ్మింటన్‌ కోచ్‌ గోపీచంద్‌కు ఒలింపిక్‌ కమిటీ పురస్కారం

  • జీవిత సాఫల్య  కోచ్‌ అవార్డుకు ఎంపిక చేసిన ఐఓసీ
  • ఇలా ఎంపికైన తొలి భారతీయుడు పుల్లెల
  • ఇది భారత్‌ కోచ్‌లందరికీ దక్కిన గౌరవం అన్న స్టార్‌

భారత్‌ బ్యాడ్మింటన్‌ స్టార్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ను అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) జీవిత సాఫల్య పురస్కారానికి ఎంపిక చేసింది. ఇటువంటి అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న తొలి భారతీయుడు గోపీచంద్‌ కావడం విశేషం. బ్యాడ్మింటన్‌ విభాగంలో ఆయన చేసిన సేవలకు గుర్తుగా పురుషుల విభాగంలో 2019వ సంవత్సరానికిగాను ఈ అవార్డు అందజేస్తున్నట్లు ఐఓసీ పేర్కొంది. ఈ సందర్భంగా గోపీచంద్‌ మాట్లాడుతూ ప్రతిష్ఠాత్మక ఐఓసీ పురస్కారం దక్కినందుకు ఆనందం వ్యక్తం చేశారు. ‘ఇది భారతీయ కోచ్‌లందరికీ దక్కిన గౌరవంగా భావిస్తా. అంతర్జాతీయంగా గుర్తింపు లభించడం చాలా సంతోషాన్నిచ్చింది. ఇటువంటి పురస్కారాలు కోచ్‌కు ఎంతో ప్రోత్సాహాన్నిస్తాయి. దేశం కోసం మరింత కష్టపడేలా చేస్తాయి’ అని వ్యాఖ్యానించాడు.

badminton
coach pullela gopichend
IOC award
Life achievment
  • Loading...

More Telugu News