KCR: కేసీఆర్ బావ కన్నుమూత!

  • గత సంవత్సరం కన్నుమూసిన కేసీఆర్ సోదరి విమలాదేవి
  • అప్పటి నుంచి హైదరాబాద్ లోనే ఉంటున్న పర్వతనేని రాజేశ్వరరావు
  • 84 ఏళ్ల వయసులో కన్నుమూత

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. కేసీఆర్ బావ పర్వతనేని రాజేశ్వరరావు కన్నుమూశారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. కేసీఆర్ సోదరి విమలాదేవి గత సంవత్సరం చనిపోగా, అప్పటి నుంచి రాజేశ్వరరావు, హైదరాబాద్‌, అల్వాల్‌ సమీపంలోని మంగాపురం కాలనీలో ఉంటున్నారు. విషయం తెలుసుకున్న కేసీఆర్, రాజేశ్వరరావు పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌ రావులతో పాటు ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు, సురేందర్‌ తదితరులు రాజేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన అంత్యక్రియలు తిరుమలగిరి స్వర్గదామ శ్మశాన వాటికలో పూర్తయ్యాయి.

KCR
Brother In law
Died
Vimala Devi
Rajeshwara Rao
  • Loading...

More Telugu News