AP IPS Officers: అదనపు డీజీపీలుగా ప్రమోషన్ పొందిన.. ఏపీ ఐపీఎస్ లు అతుల్ సింగ్, ఆర్కే మీనా

  • ఏపీలో ఐపీఎస్ అధికారులకు పదోన్నతుల ప్రకటన
  • శ్రీకాంత్, ఖాన్, ప్రభాకర్ రావు, నాగేంద్రకుమార్ కు ఐజీ ర్యాంకింగ్
  • రఘురామ్, రవికృష్ణ, సర్వశ్రేష్ఠ త్రిపాఠి, జయలక్ష్మి...లకు డిఐజీ హోదా

ఆంధ్రప్రదేశ్ లో సీనియర్ ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు లభించాయి. వీరికి పదోన్నతులతో పాటు సూపర్ టైమ్ స్కేల్ వేతనాన్ని కల్పిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం 1995 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన అతుల్ సింగ్, ఆర్కే మీనా అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హోదాలను పొందారు.

2002 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారులు సీహెచ్.శ్రీకాంత్, ఏఎస్. ఖాన్, జె.ప్రభాకర్ రావు, డి.నాంగేంద్రకుమార్ ఐజీ ర్యాంకు హోదా పొందారు. కాగా, 2006 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారులు కె.రఘురామ్, కె.రవికృష్ణ, సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఆర్ జయలక్ష్మి, జీవీజీ అశోక్ కుమార్, జి.విజయ్ కుమార్, ఎస్. హరికృష్ణ, ఎం.రవిప్రకాశ్, ఎస్వీ రాజశేఖర బాబు, కేవీ మోహనరావు, పీహెచ్ డీ రామకృష్ణ డీఐజీలుగా పదోన్నతి పొందారు.

AP IPS Officers
Promotions
Andhra Pradesh
  • Loading...

More Telugu News