Nirmala Sitharaman: అందుకే నిరర్ధక ఆస్తులు విపరీతంగా పెరిగాయి: నిర్మలా సీతారామన్

  • లోపాలను పరిష్కరించేందుకు నాలుగేళ్లు పట్టిందని వెల్లడి
  • బ్యాంకులు రుణాలు ఇవ్వకపోతే తమకు ఫిర్యాదు చేయాలని సూచన
  • ఫిర్యాదుల కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తామని వెల్లడి

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గతంలో బ్యాంకులు తమకు సంబంధించిన వారికి ఫోన్ బ్యాంకింగ్ విధానంలో రుణాలు ఇవ్వడం వల్ల నిరర్థక ఆస్తులు అధికస్థాయిలో పెరిగాయని అన్నారు. అలాంటి లోపభూయిష్ట విధానాలను సరిదిద్దడానికి తమ ప్రభుత్వానికి నాలుగేళ్ల సమయం పట్టిందని తెలిపారు.

గతంలో చోటుచేసుకున్న పరిస్థితుల నుంచి పాఠాలు నేర్చుకున్నామని చెప్పారు. ఈ సమావేశంలో నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ లోని అంశాలను ట్రేడర్లకు విడమర్చి చెప్పారు. సూక్ష్మ, చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమలకు బ్యాంకులు ఎలాంటి కారణం చెప్పకుండా రుణాలు మంజూరు చేయకపోతే తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు.  ఫిర్యాదు ప్రతిని సదరు బ్యాంకు మేనేజర్ కు కూడా పంపాలని తెలిపారు. ఇలాంటి ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News