Anasuya: నా ఫొటోను మార్ఫింగ్ చేశారు.. అసలు ఫొటో ఇదిగో!: యాంకర్ అనసూయ

  • మార్ఫింగ్ ఫొటోను ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపణ
  • మార్ఫింగ్ ఫొటో కనిపిస్తే తనకి పంపమన్న అనసూయ
  • అసలు ఫొటోను పోస్ట్ చేసిన వైనం

తనకు సంబంధించిన ఓ ఫొటోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ప్రముఖ యాంకర్ అనసూయ వెల్లడించారు. దానికి సంబంధించిన అసలైన ఫొటోను పోస్టు చేసిన అనసూయ, ఇదే అసలైన చిత్రమని, ఆ మార్ఫింగ్ ఫొటో ఎక్కడ కనిపించినా దయచేసి తనకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. కొన్నాళ్ల కిందట టెలివిజన్ రంగంలో యాంకర్ గా తనదైన ముద్రవేసిన అనసూయ ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస అవకాశాలతో దూసుకెళుతున్నారు. 'రంగస్థలం'లో రంగమ్మత్త పాత్ర ఆమె కెరీర్ కు మంచి ఊపందించింది.
అసలైన ఫొటో ఇదే...

Anasuya
Anchor
Photo
Morphing
Social Media
Tollywood
  • Loading...

More Telugu News