Prabhas: ప్రభాస్ సినిమాలో మిథున్ చక్రవర్తి

  • ప్రభాస్ నుంచి రొమాంటిక్ లవ్ స్టోరీ
  • బాలీవుడ్ స్టార్స్ కి చోటు 
  • అభిమానుల్లో పెరుగుతున్న ఆసక్తి  

ప్రభాస్ వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోను ఆయన సినిమాలకి మంచి మార్కెట్ ఉండటంతో, నిర్మాతలు ఖర్చుకు వెనుకాడటం లేదు. ఇతర భాషల్లోను విడుదల చేస్తుండటం వలన, బాలీవుడ్ ఆర్టిస్టులు ఆయన సినిమాల్లో ఎక్కువగా దర్శనమిస్తున్నారు.

ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమా కోసం 'రాధే శ్యామ్' .. 'ఓ డియర్' అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు. ఈ రొమాంటిక్ లవ్ స్టోరీలో కృష్ణంరాజు ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఇక 'మైనే ప్యార్ కియా' ఫేమ్ భాగ్యశ్రీ ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాలో మరో కీలకమైన పాత్ర కోసం 'మిథున్ చక్రవర్తి' ని తీసుకున్నారనేది తాజా సమాచారం. అది విలన్ పాత్ర అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

Prabhas
Pooja Hegde
Mithun Chakraborty
  • Loading...

More Telugu News