Yanamala: వైసీపీ మాఫియా పాలనతో పేదల పొట్టలు కొట్టారు: యనమల రామకృష్ణుడు

  • రేషన్ కార్డులు, పింఛన్ల రద్దుతో పొట్టలు కొట్టారు
  • ఒక చేత్తో ఇచ్చి, మరో చేత్తో లాక్కుంటున్నారు
  •  సబ్ ప్లాన్ నిధులను ‘అమ్మఒడి’కి మళ్లించారు

ఏపీలో వైసీపీ పాలనపై టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు తీవ్ర విమర్శలు చేశారు. గత ఎనిమిది నెలల్లో వైసీపీ మాఫియా పాలనతో పేదల పొట్టలు కొట్టారని మండిపడ్డారు. రేషన్ కార్డులు, పింఛన్ల రద్దుతో 26 లక్షల పేద కుటుంబాల పొట్టలు కొట్టారని, ఒక చేత్తో ఇచ్చి, మరో చేత్తో లాక్కుంటున్నారని ధ్వజమెత్తారు. అమ్మఒడి పథకం కింద ఒక్కో తల్లి నుంచి వెయ్యి రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారని వైసీపీ నాయకులపై ఆరోపణలు చేశారు. సబ్ ప్లాన్ నిధులను ‘అమ్మఒడి’కి మళ్లించారని ప్రభుత్వంపై ఆరోపించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోవడంతో నాలుగు లక్షల ఉద్యోగాలను యువత కోల్పోయిందని, వైసీపీ ఎనిమిది నెలల పాలనలో ఇలాంటి ఘటనలు ఎన్నో ఉన్నాయని అన్నారు.

Yanamala
Telugudesam
YSRCP
Government
  • Loading...

More Telugu News