Hyderabad: కార్ల షోరూంలో ప్రమాదం...ఎగసిపడిన అగ్నికీలలు
- ముషీరాబాద్ గోల్కొండ క్రాస్‌రోడ్స్‌లో ఘటన
- ఆరు కార్లు దగ్ధం
- నిన్న అర్ధరాత్రి దాటాక ఘటన
అర్ధరాత్రి దాటాక ఓ కార్ల షోరూంలో జరిగిన అగ్నిప్రమాదం స్థానికంగా భయాందోళనలకు కారణమైంది. హైదరాబాద్, ముషీరాబాద్ గోల్కొండ క్రాస్‌రోడ్స్‌లోని షోరూంలో నిన్న చోటు చేసుకున్న ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం సంభవించింది. ప్రాథమిక సమాచారం మేరకు ఆరు కార్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. అగ్నికీలలు ఎగసిపడడంతోపాటు పెద్దపెద్ద శబ్దాలు వినిపించడంతో చుట్టుపక్కల నివాసితులు భయాందోళనలకు గురయ్యారు. పైగా ఘటనా స్థలిని ఆనుకుని ఎల్‌పీజీ షోరూం ఉండడంతో పేలుళ్ల ధాటికి భయపడిన చుట్టుపక్కల ఇళ్లు, అపార్ట్‌మెంట్ నివాసితులు బయటకు పరుగు తీశారు.