Movie: ప్రేమగురించా.. అబ్బో చెప్పడం కష్టం: ‘వరల్డ్ ఫేమస్ లవర్’ హీరోయిన్ కేథరిన్

  • మంచి పాత్రలను పోషించాలన్నదే టార్గెట్
  • హీరో విజయ్ తో సన్నివేశాలు వినోదాత్మకంగా సాగుతాయి
  • విజయ్ పాత్రకు తగ్గట్లు ఒదిగిపోతాడు.. అతనిలో నచ్చిందే అదే

బాక్సాఫీస్ రికార్డులతో సంబంధం లేకుండా మంచి పాత్రలను పోషించాలన్నదే తన లక్ష్యమని చెబుతోంది ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రంలో ఒక హీరోయిన్ గా నటించిన కేథరిన్. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రంలో కేథరిన్ తో పాటు రాశీఖన్నా, ఐశ్వర్యరాజేశ్, ఇజబెల్లా లైట్ కూడా హీరోయిన్లుగా నటించారు. ఈ నెల 14న వేలైంటెన్స్ డే స్పెషల్ గా ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా కేథరిన్ మీడియాతో మాట్లాడుతూ.. బాక్సాఫీస్ రికార్డులతో సంబంధం లేకుండా మంచి పాత్రలను పోషించాలనేదే తన ధ్యేయమంది. సినిమా చూసినప్పుడు కేథరిన్ బాగా నటించిందని అందరూ అనుకుంటేనే తనకు తృప్తి అని తెలిపింది. 'ప్రేమను నమ్ముతాను కానీ దాని గురించి వివరించి చెప్పడం కష్టం. అది ఒక ఫీల్ గుడ్ ఎమోషన్ అని నా భావన' అంది.

‘ఈ సినిమాలో నేను స్మిత అనే అమ్మాయి పాత్రలో నటించాను. బొగ్గు గనిలో అధికారిగా కనిపిస్తాను. సినిమాలో సన్నివేశాలన్నీ చాలా సరదాగా సంతోషంగా సాగిపోతాయి. విజయ్ తో నేను నటించిన సన్నివేశాలు వినోదాన్ని పంచుతాయి. విజయ్ మంచి వ్యక్తి. సెట్ లో మౌనంగా ఉంటాడు. అతను పాత్రకు తగ్గట్లు అందులో  ఒదిగిపోతాడు. అతనిలో నాకు నచ్చిన విషయం అదే’ అని కేథరిన్ చెప్పింది.

క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి కె.ఎ. వల్లభ నిర్మాత కాగా, కె.ఎస్. రామారావు సమర్పకుడిగా వ్యవహరించారు.  

Movie
World Famous Lover
Telugu
Heroine Cathriene
  • Error fetching data: Network response was not ok

More Telugu News