Syria: సొంత విమానాన్నే కూల్చబోయిన సిరియా దళాలు... తృటిలో తప్పించుకున్న విమానం

  • శత్రువిమానంగా భావించి సొంత విమానంపై సిరియా దళాల దాడులు
  • యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్ లతో దాడులు
  • అత్యవసరంగా కిందికి దిగిన సిరియా విమానం

ఇటీవలే ఉక్రెయిన్ విమానాన్ని ఇరాన్ దళాలు పొరబాటున కూల్చివేసిన ఘటన ప్రపంచదేశాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇప్పుడు కూడా అలాంటి ప్రమాదమే జరిగేది కానీ తృటిలో తప్పిపోయింది. సిరియా దళాలు తమ దేశ విమానాన్నే కూల్చివేసేందుకు ప్రయత్నించగా, ఆ విమానం వెంట్రుకవాసిలో ముప్పు తప్పించుకుంది. సిరియా విమానయాన సంస్థ చామ్ వింగ్స్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఓ ఎయిర్ బస్ ఎ-320 విమానం ఇరాన్ నుంచి సిరియాలోని డమాస్కస్ కు వస్తోంది. ఆ సమయంలో విమానంలో 172 మంది ప్రయాణికులు ఉన్నారు.

అయితే ఆ విమానాన్ని ఇజ్రాయెల్ యుద్ధ విమానంగా సిరియా దళాలు భావించాయి. దాంతో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ఉపయోగించి దాన్ని కూల్చేందుకు ప్రయత్నించాయి. యాంటీ ఎయిర్ క్రాఫ్డ్ గన్ ల దాడుల నుంచి రెప్పపాటులో తప్పించుకున్న ఆ ప్రయాణికుల విమానం ఖ్మెమీమ్ ఎయిర్ బేస్ లో అత్యవసరంగా దిగింది. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

  • Loading...

More Telugu News