Jammu And Kashmir: బామ్మ ఐడియా ఇచ్చింది.. అమ్మకు చపాతిలో ఉత్తరం పెట్టి పంపా!: మెహబూబా ముఫ్తీ కూతురు ఇల్తిజా

  • ఆరు నెలలుగా నిర్బంధంలో ఉన్న మెహబూబా 
  • రాష్ట్ర ప్రత్యేక ప్రతిపత్తి రద్దు తర్వాత అరెస్ట్
  • నిర్భంధంలో మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా

జమ్మూ కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు తర్వాత గృహ నిర్బంధంలో ఉన్న ఆ రాష్ట్ర మాజీ సీఎం మెహబూబా ముఫ్తీని బయట వ్యక్తులు ఎవరూ కూడా కలుసుకోకుండా నిషేధం విధించారు. ఈ నేపథ్యంలో మెహబూబా కుమార్తె ఇల్తిజా తన తల్లితో మాట్లాడానికి వీలులేకపోవడంతో, తాను చెప్పదలచుకున్నదాన్ని కాగితంపై రాసి వాటిని చపాతిలో పెట్టి పంపానని తాజాగా వెల్లడించింది.  
 
తన తల్లి మెహబూబాతో లేఖల ద్వారా జరిపిన సంభాషణ విషయాన్ని ఇల్తిజా ట్వీట్ చేశారు. ‘మా అమ్మను అరెస్ట్ చేసి తీసుకెళ్లిన రోజును నేను ఎప్పటికీ మరువను. ఆ రోజు నేను ఆందోళనకు గురయ్యాను. ఒక రోజు మా అమ్మకు పంపించిన టిఫిన్ బాక్సులో ఓ కాగితం కనిపించింది. అమ్మ నాకు ఉత్తరం రాసి అందులో పెట్టి పంపించింది. అందులో 'ఐ లవ్ యూ.. ఐ మిస్ యూ' అని రాసి ఉంది. దానికి బదులు ఎలా తెలపాలో నాకు తెలియలేదు. మా బామ్మ ఇచ్చిన ఉపాయం ప్రకారం.. ఓ కాగితంపై రాసి దాన్ని చపాతిలో పెట్టి పంపాను’ అని ఇల్తిజా పేర్కొన్నారు.

Jammu And Kashmir
Former CMs Mehabubba Mufthi
Daughter
Iltija
Detained
  • Loading...

More Telugu News