BJP: అమరావతిలో జేపీ నడ్డాతో సభ ఏర్పాటు చేస్తాం: బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ

  • చంద్రబాబుపై కన్నా జగన్ పైనే ప్రజాగ్రహం 
  • అమరావతి కోసం ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం
  • రైతుల ఉద్యమాన్ని కులపోరాటంగా చూడటం దారుణం

రాజధాని అమరావతిని తరలించాలన్న ఆలోచన వెనుక కుట్ర దాగి ఉందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. అమరావతిని తరలించవద్దంటూ రైతులు చేస్తున్న ఉద్యమాన్ని కులపోరాటంగా వైసీపీ నేతలు చూడటం దారుణమని విమర్శించారు. ప్రభుత్వం మారినప్పుడల్లా ‘రాజధాని’ని మార్చుకుంటూ పోతే రాష్ట్రానికి పెట్టుబడులు రావని అన్నారు. రాజధానిని మార్చాలని విశాఖ ప్రజలేమీ కోరుకోవడం లేదని అభిప్రాయపడ్డారు. అమరావతి కోసం ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని, న్యాయపోరాటం కూడా చేస్తామని చెప్పారు. అమరావతిలో త్వరలోనే కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సభ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.

BJP
Kanna Lakshminarayana
Chandrababu
Jagan
  • Loading...

More Telugu News