Nara Lokesh: చంద్రబాబు హయాంలో వచ్చిన కంపెనీలు ఇవిగో... ట్వీట్ చేసిన నారా లోకేశ్

  • సీఎం జగన్ పై లోకేశ్ విసుర్లు
  • అన్ని ప్రాంతాలకు అన్యాయం చేస్తున్నారని విమర్శ
  • పెట్టుబడులు తీసుకురావడం ఎలాగూ చేతకాదని ఎద్దేవా
  • ఉన్న కంపెనీలను కూడా తరిమేయొద్దని హితవు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సీఎం జగన్ పై మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. సీఎం జగన్ ఉత్తరాంధ్ర, రాయలసీమకు మాత్రమే కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో అనేక కంపెనీలు వచ్చాయని, రాష్ట్ర యువతకు వేల సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తామని వచ్చిన ఆ కంపెనీలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఏపీకి వస్తాం అని ఒప్పందం చేసుకున్న ఆ కంపెనీలను వద్దు పొమ్మంటున్నారని లోకేశ్ ట్వీట్ చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం ఎలాగూ చేతకాదు, అలాంటప్పుడు ఉన్న కంపెనీలను తరిమేసి యువత భవితపై దెబ్బకొట్టకండి జగన్ గారూ అంటూ హితవు పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబు హయాంలో వచ్చిన కంపెనీలను తన ట్వీట్లలో పొందుపరిచారు.

Nara Lokesh
Chandrababu
Andhra Pradesh
Amaravati
Companies
Jagan
  • Error fetching data: Network response was not ok

More Telugu News