Nara Lokesh: ఈ విషయంలో జగన్ గారిని అభినందించాల్సిందే: నారా లోకేశ్

  • దేవుడి స్క్రిప్ట్ జగన్ నోటితోనే నిజాలు చెప్పిస్తోందన్న లోకేశ్
  • ఎన్నో అబద్ధాలు ఆడిన జగన్ ఇప్పుడు వాస్తవాలు మాట్లాడుతున్నారని వెల్లడి
  • చంద్రబాబు పాలనలో జరిగిన అభివృద్ధిని అంగీకరించారని ట్వీట్

ఏపీ సీఎం జగన్ ప్రతిసారి 'దేవుడి స్క్రిప్ట్' అంటుంటారని, ఇప్పుడా 'దేవుడి స్క్రిప్ట్' జగన్ నోటితోనే నిజాలు చెప్పిస్తోందని నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. విపక్ష నేతగా ఉన్న సమయంలో సీఎం పీఠం కోసం ఎన్నో అబద్ధాలు ఆడిన జగన్, ఇప్పుడు తన నోటితోనే వాస్తవాలు వెల్లడిస్తున్నారని ట్వీట్ చేశారు.

"అమరావతిని గ్రాఫిక్స్ అంటూ కొట్టిపారేసిన జగన్ అక్కడ రూ.6,000 కోట్ల విలువైన పనులు జరిగాయని చెప్పే పరిస్థితి వచ్చింది. పోలవరంలో అసలు పునాదే పడలేదని అబద్ధాలు చెప్పిన నోటితోనే చంద్రబాబు పాలనలో పోలవరం పనులు 58 శాతం పూర్తయ్యాయని సుప్రీంకోర్టుకు చెప్పారు. కాస్త ఆలస్యం అయినా చంద్రబాబు పాలనలో జరిగిన అభివృద్ధి గురించి జగన్ గారే స్వయంగా ప్రజలకు చెప్పడం అభినందించాల్సిన విషయం" అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

Nara Lokesh
Jagan
Chandrababu
God's Script
Polavaram Project
Supreme Court
  • Loading...

More Telugu News