IRCTC: రూ. 38 వేలతో నాలుగు రోజుల ఫారిన్ టూర్... ప్రేమికుల రోజు కోసం ఐఆర్సీటీసీ ప్రత్యేక ప్యాకేజ్!

  • ఫిబ్రవరి 14 కోసం స్పెషల్ టూర్
  • రూ. 38 వేలతో నాలుగు రోజుల ఫారిన్ టూర్
  • బ్యాంకాక్, పటాయాలకు ప్యాకేజ్

మరో వారంలో ప్రేమికుల రోజు రానుంది. తమ మనసుకు నచ్చిన యువకుడు, యువతికి ఘనమైన కానుకలు ఇచ్చి, ప్రేమను వ్యక్తపరిచే వాలెంటైన్స్ డేను మరింత మధురంగా జరుపుకునేందుకు ఐఆర్సీటీసీ (ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌) స్పెషల్ ప్యాకేజీని ప్రకటించింది.

రూ. 38 వేలు చెల్లించి, ధాయ్ లాండ్, బ్యాంకాక్, పటాయాలను నాలుగు రోజుల పాటు సందర్శించేలా ఈ ప్యాకేజీని తయారు చేసింది. ఈ నెల 12 నుంచి ప్రారంభమై 16తో ముగిసే ప్యాకేజీలో 14న ప్రైవేట్‌ పూల్‌ పార్టీ, గాలా డిన్నర్‌ ఉంటాయి. విమానం టికెట్, బ్యాంకాక్‌ లో 2 రాత్రులు, పట్టాయాలో 2 రాత్రులు, త్రీస్టార్‌ క్యాటగిరీ వసతి, అన్ని రోజులూ అల్పాహారం, భోజనం, ఏసీ వెహికిల్ లో సైట్‌ సీయింగ్‌, వీసా చార్జీలు, ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ వంటివన్నీ ఇందులో ఉంటాయని ఐఆర్సీటీసీ పేర్కొంది.

IRCTC
Lovers Day
Valentines Day
Package
Bangkok
Pataya
Thailand
  • Loading...

More Telugu News