Pawan Kalyan: జనసేన కార్యకర్తల సమావేశంలో పాత పవర్‌స్టార్‌లా పవన్ లుక్!

  • ‘పింక్’ షూటింగులో పాల్గొంటున్న పవర్‌స్టార్
  • గడ్డం లేకుండా పవన్ ను చూసి ముచ్చటపడుతున్న అభిమానులు
  • మీసం, ఒత్తైన జుట్టుతో కనిపించిన జనసేనాని

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజా లుక్ అభిమానులకు ఆనందం పంచుతోంది. గత ఎన్నికల తర్వాత పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి దిగిన పవన్ తెలుగు తెరకు దాదాపు దూరమయ్యారు. ఇప్పటి వరకు ఒక్క సినిమాలోనూ నటించని ఆయన తాజాగా, మూడు సినిమాలు అంగీకరించారు. ఇందులో ఒకటి బాలీవుడ్ సినిమా ‘పింక్’ రీమేక్ కాగా, క్రిష్, హరీశ్ శంకర్‌లతో మరో రెండు సినిమాలు చేస్తున్నారు.

రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత గుబురు గెడ్డం, ఒత్తైన జుట్టు, మీసాలతో కనిపించిన పవన్ ఇప్పుడు సరికొత్త లుక్‌లో కనిపించారు. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గ జనసేన కార్యకర్తల సమావేశం నిన్న జరిగింది. ఈ సమావేశానికి హాజరైన పవన్ మునుపటి పవర్‌స్టార్‌ను తలపించారు. నున్నటి షేవ్‌లో గుబురు మీసం, ఒత్తైన జుట్టుతో హాజరయ్యారు. రెండేళ్ల తర్వాత పవన్‌ను ఇలా చూసిన అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ‘పింక్’ షూటింగులో పాల్గొంటున్న పవన్.. అందులో భాగంగానే గుబురు గడ్డాన్ని తొలగించారు. ఈ సినిమాలో పవన్ న్యాయవాది పాత్ర పోషిస్తున్నారు.

Pawan Kalyan
power star
Janasena
Tollywood
pink movie
  • Loading...

More Telugu News