Chandrababu: చంద్రబాబు మాజీ పీఏ శ్రీనివాసరావు నివాసంపై ఐటీ దాడులు!

  • ఆదాయానికి మించి ఆస్తులు కలిగివున్నారని ఆరోపణలు
  • విజయవాడలో శ్రీనివాసరావు నివాసంలో సోదాలు
  • బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు
  • పలు కీలక పత్రాల స్వాధీనం

టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాసరావు నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. చంద్రబాబు పీఏగా గత ఎన్నికల ముందు వరకు శ్రీనివాసరావు పనిచేశారు. ప్రస్తుతం ఆయన సచివాలయం జీఏడీలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తులు కలిగివున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో విజయవాడలో శ్రీనివాసరావుకు చెందిన కంచుకోట అపార్ట్ మెంట్ లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. విజయవాడ, హైదరాబాదులోని శ్రీనివాసరావు బంధువుల నివాసాల్లోనూ సోదాలు నిర్వహించినట్టు తెలిసింది. దాడుల సందర్భంగా అనేక కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.

Chandrababu
Ex PA
Srinivasarao
ED
Vijayawada
Andhra Pradesh
  • Loading...

More Telugu News