Devineni Uma: కియా మోటార్స్ తరలింపుపై జగన్ మాట్లాడాలి: దేవినేని ఉమ

  • కియా మోటార్స్ తరలిపోతోంది
  • వైసీపీ ప్రభుత్వ తీరే దీనికి కారణం
  • ఇప్పటికే ఎన్నో పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలి వెళ్లాయి

ఏపీ నుంచి కియా మోటార్స్ తరలిపోతోందనే వార్త ప్రకంపనలు పుట్టిస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ నేత దేవినేని ఉమ మాట్లాడుతూ, కియా మోటార్స్ ను పక్క రాష్ట్రానికి తరలించబోతున్నారని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలే దీనికి కారణమని మండిపడ్డారు.

వైసీపీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి కియా పరిశ్రమలోని ఓ అధికారిని బెదిరించడం మీడియాలో మనమంతా స్పష్టంగా చూశామని తెలిపారు. ఈ ఘటనను మీడియాలో చూసిన అనేక సంస్థలు... ఎందుకొచ్చిన తలనొప్పి అనే భావనతో ఇప్పటికే పక్క రాష్ట్రాలకు తరలిపోయాయని చెప్పారు.

కియా మోటార్స్ తో కరవు ప్రాంతమైన అనంతపురం జిల్లాకు పారిశ్రామిక కళ వచ్చిందని, వేలాది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయని దేవినేని ఉమ అన్నారు. అలాంటి పెద్ద పరిశ్రమ కియా తరలిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కియా మోటార్స్ తరలింపుపై ముఖ్యమంత్రి జగన్ స్పందించాలని డిమాండ్ చేశారు.

Devineni Uma
Telugudesam
Jagan
YSRCP
KIA Motors
  • Loading...

More Telugu News