Srinivasulu reddy: కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి ఇంటిపై ఆదాయ పన్ను శాఖ దాడులు!

  • ఈరోజు తెల్లవారు జామున వచ్చిన పది మంది అధికారుల బృందం
  • పన్ను చెల్లింపుపై ఆరా
  • వ్యాపారానికి సంబంధించిన పలు రికార్డుల పరిశీలన

కడప జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు శ్రీనివాసులురెడ్డి ఇంటిపై ఈరోజు తెల్లవారు జామున ఆదాయపన్ను శాఖ అధికారులు దాడి చేశారు. మొత్తం 10 మంది అధికారులతో కూడిన బృందం శ్రీనివాసులురెడ్డి ఇంటికి చేరుకుంది. ఆయన ఆదాయ పన్ను చెల్లింపు వివరాలపై ఆరాతీసింది. ఆయన వ్యాపారాలకు సంబంధించిన పలు దస్త్రాలు, రికార్డులను ప్రస్తుతం అధికారులు పరిశీలిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీనివాసులురెడ్డిపై ఐటీ శాఖ దాడుల సమాచారం స్థానికంగా సంచలనమైంది.

Srinivasulu reddy
Kadapa District
Telugudesam
Income Tax
  • Loading...

More Telugu News