Crime News: కామాంధుడైన తండ్రికి యావజ్జీవ కారాగారం

  • కాకినాడ మూడో అదనపు న్యాయమూర్తి తీర్పు
  • పద్నాలుగేళ్ల కూతురిపై అత్యాచారం 
  • గర్భం దాల్చడంతో వెలుగులోకి వచ్చిన అనైతిక చర్య

కంటికి రెప్పలా కాపాడి ఓ అయ్య చేతిలో పెట్టి మురిసిపోవాల్సిన తండ్రి కళ్లకు కామపుపొరలు కమ్ముకుని కూతురిపై అత్యాచారం చేసి, గర్భవతిని చేశాడు. ఈ కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కాకినాడ మూడో అదనపు న్యాయమూర్తి తీర్పు చెప్పారు. అమలాపురం గ్రామీణ పోలీసులు అందించిన వివరాల మేరకు... తూర్పుగోదావరి జిల్లా అంబాజీ పేటకు చెందిన ఓ వ్యక్తికి 14 ఏళ్ల కుమార్తె ఉంది. భార్య కువైట్ వెళ్లిపోవడంతో అతని దృష్టి కూతురిపై పడింది.

2015 నుంచి పలుమార్లు ఆమెపై అత్యాచారం చేశాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించేవాడు. తండ్రి చేసిన అనైతిక పనితో ఆ బాలిక గర్భం దాల్చింది. ఆమె ఆరోగ్యం రోజు రోజుకీ క్షీణిస్తుండడంతో అనుమానం వచ్చిన మేనమామ వైద్యపరీక్షలు చేయించగా గర్భవతి అని తేలింది. ఇందుకు కన్నతండ్రే కారణమని బాధితురాలు తెలియజేయడంతో అతను షాక్ కు గురయ్యాడు.

అనైతిక చర్యపై  2016 జనవరి 6న బాధితురాలి మేనమామ అంబాజీపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు విచారణ జరిపి వివరాలు కోర్టు ముందుంచారు. కేసును విచారించిన న్యాయమూర్తి నిందితుడికి జీవిత ఖైదు విధించడంతోపాటు వెయ్యి రూపాయల జరిమానా కూడా విధిస్తూ తీర్పు చెప్పారు.

Crime News
East Godavari District
father convicted
life prision
  • Loading...

More Telugu News