Intercity express rail: విజయవాడ వెళ్లే ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు.. నిలిపివేత
- బాంబు పెట్టినట్టు ఫోన్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు
- బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు
- విషయం తెలిసి రైలు దిగి పరుగులు తీసిన ప్రయాణికులు
సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌లో బాంబు కలకలం రేగింది. రైలులో బాంబు పెట్టినట్టు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి చెప్పడంతో అప్రమత్తమైన రైల్వే పోలీసులు వెంటనే రైలును నిలిపివేశారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు.
విషయం తెలిసిన ప్రయాణికులు భయంతో రైలు దిగి పరుగులు తీశారు. రాష్ట్ర విభజన తర్వాత ఉద్యోగుల సౌకర్యార్థం ఈ రైలును ఏర్పాటు చేశారు. ఎంప్లాయీస్ బండిగా పేరున్న ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కువమంది ప్రభుత్వ ఉద్యోగులే ప్రయాణిస్తుంటారు. కాగా, బాంబు బెదిరింపునకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.