Crime News: భర్తను బండరాయితో మోది చంపేసింది

  • నిద్రిస్తున్న సమయంలో దారుణం
  • మతిస్థిమితంలేని భార్య చేతిలో భర్త హతం 
  • సూర్యాపేట జిల్లాలో ఘటన

ఆదమరిచి నిద్రపోతున్న వ్యక్తిని భార్య బండరాయితో మోది దారుణంగా హత్య చేసిన ఘటన ఇది. ఆమెకు మతిస్థిమితం లేదని, ఐదు నెలల నుంచి వైద్యచికిత్స పొందుతోందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సూర్యాపేట జిల్లా చెవ్వెంల మండలం మోదినిపురం గ్రామానికి చెందిన కాకి వెంకటరెడ్డి (52) భార్యకు గత కొంతకాలంగా మతిస్థిమితం లేదు. దీంతో భార్యకు ఆయన వైద్యం చేయిస్తున్నాడు. ఈ క్రమంలో నిన్న రాత్రి వెంకటరెడ్డి నిద్రలో ఉండగా అతని భార్య సమీపంలోని బండరాయిని తెచ్చి తలపై గట్టిగా మోదింది. దీంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు ఘటనా స్థలిని సందర్శించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Crime News
husbend murdered
wife accused
  • Loading...

More Telugu News