Matchfinder: ప్రెస్ నోట్: మ్యాచ్‌ఫైండర్.ఇన్ (matchfinder.in) యొక్క రూ.100 ప్లాన్ ప్రారంభించిన నటి రష్మి గౌతమ్
ప్రెస్ నోట్: హైదరాబాద్, ఫిబ్రవరి 5, 2020: మ్యాచ్‌ఫైండర్ ఆన్‌లైన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్., భారతదేశంలో వేగంగా ఎదుగుతున్న వివాహ సంబంధాల పరిచయ వేదిక తన సేవలను వినియోగదారుల కోసం మరింత సౌలభ్యంగా అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా, స్టేట్-ఆఫ్-ది-ఆర్ట్ మ్యాచ్‌ఫైండర్ కస్టమర్ కేర్ సెంటర్ మరియు సృజనాత్మకంగా ముందుకు సాగి రూ.100కే సభ్యత్వం అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఉత్తమమైన వివాహ సంబంధాల వేదికగా నిలవడం మరియు తక్కువ ధరకే సభ్యత్వం అవకాశం కల్పించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది.
టాలీవుడ్ ప్రముఖ నటీ మరియు యాంకర్ కుమార్ రష్మి గౌతమ్ ఈ రెండు సేవలు ప్రారంభం అయ్యాయి. కేపీహెచ్‌బీ కాలనీలోని మ్యాచ్‌ఫైండర్ ఆఫీసులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మ్యాచ్‌ఫైండర్ ఆన్‌లైన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రత్తయ్య, మరియు మ్యాచ్‌ఫైండర్ ఆన్‌లైన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ శ్రీ విజయ్ ఈ సందర్భంగా పాల్గొన్నారు.
మ్యాచ్‌ఫైండర్ ఆన్‌లైన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (matchfinder.in) డైరెక్టర్ శ్రీ విజయ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత ఐదు సంవత్సరాలుగా మ్యాచ్‌ఫైండర్ ద్వారా ఆన్‌లైన్‌లో వివాహ సంబంధాలు కుదిర్చే సేవలు అందిస్తున్నామని తెలిపారు. తమ డాటాబేస్‌లో 2లక్షలకు పైగా ప్రొఫైల్లు అందుబాటులో ఉన్నాయన్నారు. వివాహ సంబంధాల కోసం చూస్తున్నవారికి మరియు తమ రిజిస్టర్డ్ యూజర్ల కోసం సులభంగా వినియోగించుకోగలిగిన మరియు సురక్షితమైన రీతిలో తమ సేవలు అందిస్తున్నామని తెలిపారు.
వివాహ పరిచయ రంగానికి సంబంధించిన వ్యాపార రంగంలో మునుపెన్నడూ లేని రీతిలో మేం మొట్టమొదటి సారిగా రూ.100కే సభ్యత్వం అవకాశం కల్పిస్తున్నాం. మరే సైట్ కూడా ఇంత తక్కువ ధరలో సభ్యత్వం అందివ్వడం లేదు. ఈ నిర్ణయం మార్కెట్లో విప్లవాత్మక మార్పులకు వేదికగా నిలుస్తుంది మరియు మమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకుపోవడానికి నిలుస్తుంది.
ఈ సౌలభ్యాన్ని వినియోగించుకోవాలని భావించే వినియోగదారులు మ్యాచ్‌ఫైండర్.ఇన్ (matchfinder.in)లో తమ వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం, సదరు వ్యక్తి తన ఆసక్తులకు తగిన రీతిలో భాగస్వామిని ఎంచుకోవచ్చు. ఈ సమయంలోనే వారు కేవలం రూ.100 మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. అనంతరం సంబంధిత సభ్యులు అందించిన డాటా ఆధారంగా వారిని సంప్రదించవచ్చు.
ఈ సౌలభ్యం వివాహ సంబంధాల ప్రయత్నాల్లో ఉన్నవారికి పెద్ద వెసులుబాటుగా నిలుస్తుంది. దీంతో పాటుగా వివాహ సంబంధం కుదుర్చుకునేందుకు కావాల్సిన జాతక సంబంధ అంశాలు, హైలైటింగ్ ప్రొఫైల్స్ మరియు పలు రకాలైన ఇతర వాల్యూ యాడెడ్ సేవలను సైతం మేం అందిస్తున్నాం. ఈ సందర్భంగా సినీ నటి రష్మి గౌతమ్ మాట్లాడుతూ, `పెళ్లి సంబంధాలు స్వర్గంలో కుదుర్చబడతాయి` అని గతంలో తెలిపేవారు. అయితే, ప్రస్తుత తరుణంలో వివాహ సంబంధాలు ఆన్‌లైన్లో కుదుర్చబడుతున్నాయి. ఫాస్ట్‌ఫుడ్ లేదా ఇన్‌స్టంట్ నూడుల్స్ వలే, ప్రస్తుత తరానికి వివాహం సైతం సౌకర్యవంతంగా మరియు వేగంగా పూర్తవ్వాలని కోరుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో నేడు ప్రతి ఒక్కరి చూపు మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లపై పడింది. అలాంటి వెబ్‌సైట్లలో టాప్‌లో నిలిచేది మ్యాచ్‌ఫైండర్. మన జీవనశైలి ప్రస్తుత పరిస్థితుల్లో సంక్లిష్టంగా మరియు ఒత్తిళ్లమయంగా మారిపోయింది. ఈ తరుణంలో జీవిత భాగస్వామిని అన్వేషించడం కష్టమైన అంశంగా మారింది. జీవిత భాగస్వామిని ఎంచుకునే అవకాశం తల్లిదండ్రులు పిల్లలకే వదిలివేసినప్పటికీ... యువతకు సరైన సంబంధం వెతుక్కోవడం కష్టసాధ్యంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వివాహ సంబంధాలను కుదిర్చే సైట్లపై ఆధారపడుతున్నారు.
మ్యాచ్‌ఫైండర్.ఇన్ (matchfinder.in) సులభంగా ఉపయోగించే వీలున్న వెబ్‌సైట్. ఇతర వెబ్‌సైట్లతో పోలిస్తే, వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉండటం మరియు ఆర్థికంగా కూడా పెద్దగా భారం కాని రీతిలో ఉంది. రూ.100 ఫీజు అనేది నామమాత్రపు రుసుం అని నిస్సందేహంగా చెప్పవచ్చు. మ్యాచ్‌ఫైండర్ వెబ్‌సైట్లో అధునాతన టెక్నాలజీని వినియోగించి, అద్భుతమైన ఆప్షన్లతో మెరుగైన సేవలు అందించబడుతున్నాయి.
ఈ వెబ్‌సైట్లో ఉన్న ఎక్స్‌లెంట్ ప్రొఫైల్స్ కారణంగా తమకు అత్యంత నచ్చిన వారిని ఎంచుకోవచ్చు. ఈ సౌలభ్యం వల్ల మీ జీవితానికి సరైన భాగస్వామిని పొందవచ్చు మరియు భాగస్వామితో ఎలాంటి సమస్యలు లేని జీవితం గడపవచ్చు.
దీంతోపాటుగా సంబంధిత వ్యక్తి యొక్క బ్యాక్‌గ్రౌండ్ చెక్, వారి ఆసక్తులు, ఆహారపు అలవాట్లు సహా అనేక ఇతర అంశాలు వెబ్‌సైట్లో పొందుపర్చబడి ఉంటాయి. ఈ నేపథ్యంలో పెళ్లికాని వారు తమ జీవితానికి తగిన భాగస్వామిని మ్యాచ్‌ఫైండర్.ఇన్‌లో (matchfinder.in) పొందవచ్చు. కులం, మతం, భాష, సమాజం వంటి అంశాలకు అతీతంగా అందరికీ ఉపయుక్తంగా నిలిచే వెబ్‌సైట్ ఇది.
నూతనంగా ఏర్పాటు చేయబడిన మ్యాచ్‌ఫైండర్ కస్టమర్ కేర్ సెంటర్‌లో లేటెస్ట్ జనరేషన్ టెక్నాలజీ ఉపయోగించడం వల్ల వినియోగదారులు సేవలు పొందిన అనంతరం వారి సంతృప్తి స్థాయి పెరుగుతుంది. మ్యాచ్‌ఫైండర్ (matchfinder.in) కస్టమర్ కేర్ సెంటర్‌ను అత్యంత సుశిక్షితులైన ఎగ్జిక్యూటివ్‌లు నిర్వహిస్తూ వినియోగదారులతో అన్ని భాషల్లోనూ ఆత్మీయ సంభాషణలు చేయగలుగుతారు. ఈ ఎగ్జిక్యూటివ్‌లు ఓపికగా వినియోగదారుల అభిప్రాయాలు వినడం మరియు సరైన స్పందన ఇవ్వడం అనే లక్షణాలతో పాటుగా మంచి వ్యవహారిక నైపుణ్యాలు, ఉత్తమమైన నిర్వహణ సంబంధ పరిజ్ఞానం, సమస్యలను పరిష్కరించే పరిజ్ఞానం సైతం కలిగి ఉన్నవారు.
వినూత్నమైన ఈ రూ.100 సభ్యత్వ రుసుం ప్లాన్, తొలిసారిగా వినియోగదారుల కోసం ప్రవేశపెట్టబడింది. వివాహ సంబంధాల విషయంలో తమకు సరైన వారిని ఎంచుకునేందుకు మెరుగైన అవకాశాన్ని కల్పిస్తుంది.
ఈ ప్లాన్ వినియోగించుకునేందుకు రూ.100 చెల్లించడం వల్ల, సంబంధిత వ్యక్తి తమకు ఆసక్తి ఉన్న వారి యొక్క ప్రొఫైల్, సంప్రదించాల్సిన వివరాలు పొందవచ్చు. ఈ సభ్యత్వానికి 3 నెలల కాల వ్యవధి ఉంటుంది. ఈ పరిమితి ముగిసిన అనంతరం వినియోగదారుడు సంస్థను సంప్రదించి టాప్-అప్ సేవలు పొందవచ్చు.
ఈ సేవలను వినియోగించుకోవాల్సిన వారు చేయాల్సిందల్లా కేవలం మ్యాచ్‌ఫైండర్ వెబ్‌సైట్ (https://www.matchfinder.in)లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ఈ ప్లాన్ కొనుగోలు చేయడమే. అనంతరం తమకు నచ్చిన ప్రొఫైల్‌ను సంప్రదించవచ్చు.
మ్యాచ్‌ఫైండర్ యొక్క ఈ రెండు ఆవిష్కరణలు నిర్వహణ సంబంధమైన మెరుగైన సేవల అందించడమే కాకుండా వినియోగదారులకు ఆర్థికంగా కూడా భారం కాకుండా ఉపయోగపడతాయి. వివాహ సంబంధాల పరిశ్రమలో ఈ నిర్ణయాలు కొంగొత్త మార్పులకు వేదికగా నిలుస్తాయి. మ్యాచ్ ఫైండర్ యొక్క ఈ నూతన టెక్నాలజీ వల్ల వినియోగదారులకు గొప్ప సేవల అనుభూతి రావడమే కాకుండా రాబోయే కాలంలో మ్యాచ్‌ఫౌండర్‌కు చెందిన ఖాతాదారుల నుంచి సానుకూల ఫీడ్‌బ్యాక్ రానుంది.
ఈ కొత్త రూ.100 మెంబర్‌షిప్ ప్లాన్ వల్ల వివాహ సంబంధమైన పరిశ్రమలో అధిక చార్జీల భారం మోపే విధానానికి తెరపడనుంది. అంతేకాకుండా గతంలోనే చూసిన మరియు పదే పదే కనిపించే ప్రొఫైల్లను తిరిగి వీక్షించాల్సిన ఇబ్బంది కూడా తప్పుతుందని శ్రీ రత్తయ్య ఈ సందర్భంగా తెలిపారు.
మ్యాచ్ ఫైండర్ గురించి:
మ్యాచ్‌ఫైండర్, భారతదేశంలో అందుబాటు ధరల్లో వివాహ సంబంధ సేవలు అందిస్తున్న వెబ్‌సైట్.
తెలుగు, బెంగాళీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మళయాళం, మరాఠి, ఒరియా, పంజాబీ, తమిళ్ మరియు ఉర్దూ వంటి బహుళ భాషల్లో సేవలు అందిస్తోంది.
భారతదేశంలోని దాదాపు 2000 పైచీలుకు సామాజికవర్గాలకు చెందిన వధువు మరియు వరుడులకు చెందిన సమాచారం కలిగిన సురక్షిత వేదిక. ఈ సైట్‌లోకి సైన్ అప్ అవడం ఉచితం. వివాహ సంబంధాల పరిచయాలతో పాటుగా వివాహ సంబంధం కుదుర్చుకునేందుకు కావాల్సిన జాతక సంబంధ అంశాలు, హైలైటింగ్ ప్రొఫైల్స్ మరియు పలు రకాలైన ఇతర వాల్యూ యాడెడ్ సేవలను సైతం మ్యాచ్‌ఫైండర్ అందిస్తోంది.
వినియోగదారులకు సంబంధించిన సమాచారం అత్యంత భద్రంగా ఉంచుతామని సంస్థ స్పష్టం చేస్తోంది. ప్రతిరోజూ మరియు వారానికోమారు వివాహ సంబంధమైన సమాచారం అందించడం, సమగ్రమైన మరియు సింగిల్ పేజ్ రిజిస్ట్రేషన్ వంటి ఇతర వాల్యూ అడిషన్లను సైతం సైట్ అందిస్తోంది.
Press release by: Indian Clicks, LLC