Rahul Gandhi: ఏదో ఒక రోజున మోదీ దానికి కూడా బేరం పెట్టేస్తారు: రాహుల్ గాంధీ

  • ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్
  • మోదీ తాజ్‌మహల్‌నూ అమ్మేస్తారన్న కాంగ్రెస్ నేత
  • కేజ్రీవాల్‌పైనా తీవ్ర విమర్శలు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏదో ఒక రోజు తాజ్‌మహల్‌నూ అమ్మేస్తారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దెప్పిపొడిచారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జాంగ్‌పూర్‌లో మాట్లాడిన రాహుల్.. మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ప్రజల్లో విద్వేషాలు పెంచుతున్నారని మండిపడ్డారు.

మోదీ మేకిన్ ఇండియా నినాదం ప్రచారానికే పరిమితమైందని, ఆగ్రాకు ఇప్పటి వరకు ఒక్క ఫ్యాక్టరీ కూడా రాలేదని రాహుల్ అన్నారు. ప్రధాని అన్నింటినీ అమ్మేస్తుంటారని, ఏదో ఒక రోజు తాజ్‌మహల్‌నూ బేరానికి పెట్టేస్తారని విమర్శించారు. నిరుద్యోగాన్ని పారదోలి యువతకు ఉద్యోగాలు కల్పించాలన్న ధ్యాస అటు మోదీకీ, ఇటు కేజ్రీవాల్‌కు ఇద్దరికీ లేకుండా పోయిందన్నారు. అధికారం కోసమే వారి పోరాటమని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Rahul Gandhi
Narendra Modi
Arvind Kejriwal
Delhi elections
Taj Mahal
  • Loading...

More Telugu News