GST: జీఎస్టీపై లాటరీ తీసుకొచ్చేందుకు కేంద్రం యోచన... వినియోగదారులు రూ.కోటి వరకు గెలుచుకునే చాన్స్!

  • బిల్లు అడిగి తీసుకోవడాన్ని ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయం
  • జీఎస్టీ సహిత బిల్లుతో లాటరీ విధానం
  • రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకు ప్రైజ్ మనీ
  • త్వరలోనే విధివిధానాల ప్రకటన

దుకాణాలకు వెళ్లే వారిలో చాలామంది బిల్లు తీసుకోవడం ఎందుకులే అని భావిస్తుంటారు. బిల్లు ఇవ్వడం ఎందుకులే అని భావించే దుకాణదారులు కూడా ఉంటారు. అయితే ఆ పద్ధతిని రూపుమాపేందుకు కేంద్రం సరికొత్త పథకం తీసుకువస్తోంది. జీఎస్టీపై లాటరీ ప్రవేశపెట్టాలని భావిస్తోంది.

ఇక తాను కొనుగోలు చేసే ప్రతి వస్తువుకు బిల్లు అడిగి తీసుకునేలా వినియోగదారుడ్ని ప్రోత్సహించడమే కేంద్రం ఉద్దేశం. జీఎస్టీతో బిల్లు తీసుకునే ప్రతి వినియోగదారుడు ఈ లాటరీలో పాలుపంచుకున్నట్టే. ఈ లాటరీలో భాగంగా వినియోగదారులు రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకు గెలుచుకోవచ్చు. వినియోగదారులు తమ జీఎస్టీ సహిత బిల్లులను సంబంధిత వెబ్ సైట్లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. పరిమిత కాలవ్యవధిలో డ్రా ప్రక్రియ నిర్వహించి విజేతలను ప్రకటిస్తారు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తిస్థాయి విధివిధానాలను కేంద్రం ఓ ప్రకటన ద్వారా వెల్లడించనుంది.

GST
India
Bill
Lottery
Consumer
  • Error fetching data: Network response was not ok

More Telugu News