B.Tech: బీటెక్ లో నాలుగు కొత్త కోర్సులకు జేఎన్టీయూహెచ్ రూపకల్పన

  • ఇంజినీరింగ్ విద్యా ప్రమాణాలపై విమర్శలు
  • చర్యలకు ఉపక్రమించిన జేఎన్టీయూ హైదరాబాద్
  • ఉన్నతస్థాయి విద్యాప్రమాణాలతో కొత్త కోర్సులు
  • బీటెక్ లో 22కి చేరిన కోర్సుల సంఖ్య

అప్పటికీ ఇప్పటికీ ఇంజినీరింగ్ కోర్సులంటే యువతలో ఎంతో క్రేజ్ ఉంది. అయితే కొంతకాలంగా ఇంజినీరింగ్ విద్య నాసిరకంగా తయారవుతోందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జేఎన్టీయూ హైదరాబాద్ తగు చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో బీటెక్ లో ఉన్నత స్థాయి విద్యా ప్రమాణాలతో కూడిన నాలుగు కొత్త కోర్సులకు రూపకల్పన చేసింది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ, ఐటీ అండ్ ఇంజినీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ కోర్సులు తీసుకురానుంది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లభించిన తర్వాత కాలేజీలు కొత్త కోర్సులకు అనుగుణంగా సీట్ల సంఖ్య పెంచుకోవచ్చని జేఎన్టీయూ హైదరాబాద్ వర్గాలు తెలిపాయి. ఈ మార్పుతో బీటెక్ లో కోర్సుల సంఖ్య 22కి చేరింది.

B.Tech
JNTU-H
Hyderabad
New Courses
  • Error fetching data: Network response was not ok

More Telugu News