YSRCP: అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా వైసీపీ కార్యక్రమాలు

  • ఈ నెల 6వ తేదీన మానవహారాలు
  • 7న క్యాండిల్ ర్యాలీ
  • 8న ‘చంద్రబాబుకి బుద్ధి రావాలి’ అని కోరుతూ పూజలు

ఏపీ రాజధానిని అమరావతి నుంచి తరలించవద్దంటూ రైతులు, స్థానికులు చేస్తున్న నిరసన కార్యక్రమాలు నలభై తొమ్మిది రోజులుగా కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా అధికార వైసీపీ నేతలు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఇందులో భాగంగా ఈ నెల 6వ తేదీన మానవహారాలు, 7న క్యాండిల్ ర్యాలీ, 8న ‘చంద్రబాబుకి బుద్ధి రావాలి’ అని కోరుతూ పూజలు నిర్వహించనున్నారు. ఈ నెల 10న అన్ని జిల్లాల్లో మేధావులతో, రౌండ్ టేబుల్ సమావేశాలు, 12న వంటావార్పు, 13న రిలే దీక్షలు, 14న గులాబీలు, కరపత్రాల పంపిణీ, 15న అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలను సమర్పించనున్నారు.

YSRCP
Amaravati
capital
Rally
Relay Deeksha
  • Loading...

More Telugu News