Payal Rajput: ఫైటర్ పైలెట్ పాత్రలో పాయల్

  • పాయల్ కి మంచి క్రేజ్ 
  • ముగింపు దశలో 'నరేంద్ర'
  • వేసవిలో ప్రేక్షకుల ముందుకు

ఆకర్షణీయమైన ఎత్తు .. అందుకు తగిన అందం పాయల్ సొంతం. తెలుగులో 'ఆర్ ఎక్స్ 100' సినిమాతో యూత్ ను తనవైపు తిప్పుకుంది. అలాంటి పాయల్ 'వెంకీమామ'లో వెంకటేశ్ తో కలిసి సందడి చేసింది. ప్రస్తుతం ఆమె 'నరేంద్ర' అనే సినిమా చేస్తోంది. జయంత్ సి. పరాన్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆమె నీలేశ్ జోడీగా కనిపించనుంది.

శత్రుదేశం నుంచి తప్పించుకున్న ఓ బాక్సర్, తన మాతృదేశానికి ఎలా చేరుకున్నాడనే కథాంశంతో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఫైటర్ పైలెట్ గా ఈ సినిమాలో పాయల్ కనిపించనుండటం విశేషం. అనూహ్యమైన మలుపులతో సాగే ఈ కథలో మరో నాయికగా ఇజబెల్లె లైట్ కనిపిస్తుందట. చిత్రీకరణ పరంగా ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది.  వేసవి సెలవుల్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.

Payal Rajput
Neelesh
Narendra Movie
  • Loading...

More Telugu News