Hyderabad: ఆ నలుగురూ నన్ను మానసికంగా వేధించారు: సూసైడ్ నోట్ లో వైష్ణవి ఆసుపత్రి ఎండీ డాక్టర్ అజయ్

  • కలకలం రేపిన బలవన్మరణం 
  • ఆసుపత్రిలోనే ఉరివేసుకున్న అజయ్ 
  • ఆరాతీస్తున్న పోలీసులు

హైదరాబాద్ ఎల్ బీనగర్ లోని వైష్ణవి ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అజయ్ బలవన్మరణం స్థానికంగా కలకలం రేపింది. 'ఆ నలుగురూ నన్ను మానసికంగా వేధిస్తున్నారు. అందుకే చనిపోవాలని నిర్ణయించుకున్నాను' అంటూ డైరీలో పేర్లు రాసిమరీ అజయ్ చనిపోవడం చర్చనీయాంశంగా మారింది. అజయ్ ఆసుపత్రిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అంతకు ముందు డైరీలో యాంజాల్ కు చెందిన కొత్త కురుమ్మ శివకుమార్, కరుణారెడ్డి, కొండల్ రెడ్డి, మేఘారెడ్డి పేర్లు రాస్తూ వారే తన మరణానికి కారణమని పేర్కొన్నారు.

Hyderabad
LBNagar
vyshnavi MD suicide
Crime News
  • Loading...

More Telugu News