Vikky Koushal: తొలి అడుగు తోనే గుండెలదిరే భయాన్ని నింపిన విక్కీ కౌశల్... 'భూత్' ట్రయిలర్ ఇదిగో!

  • సర్వేయింగ్ అధికారి పాత్రలో విక్కీ
  • ముంబై తీరానికి కొట్టుకొచ్చిన షిప్ గురించి కథ
  • నౌకలో ఆత్మలతో గడిపే విక్కీ

యూరీ, మన్ మర్జయాన్ చిత్రాల తరువాత విక్కీ కౌశల్ నటిస్తున్న 'భూత్: ది హంటెడ్ షిప్' ఇప్పుడు నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. హారర్ చిత్రంగా ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా భాను ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కించాయి. ఇక ఇందులో విక్కీ సర్వేయింగ్ అధికారి పృథ్వీ పాత్రలో నటిస్తున్నాడు.

ఇక ఈ సినిమా ఎంతో భయంకరంగా ఉంటుందని ట్రయిలర్ చూస్తే తెలుస్తోంది. ముంబై తీరానికి ఏ విధమైన ప్రయాణికులు, సిబ్బంది లేకుండా కొట్టుకుని వచ్చిన 'సీ బర్డ్' అనే షిప్ లో ఏం జరిగిందో తెలుసుకునేందుకు పృథ్వీ వెళ్లనున్నాడని ట్రయిలర్ చూస్తే తెలుస్తోంది. షిప్ లో ఆత్మలు తిరుగుతూ ఉండటం, పృథ్వీని చుట్టుముట్టి ఈడ్చుకెళ్లడం వంటి భయపెట్టే దృశ్యాలు కొన్నింటిని ట్రయిలర్ లో చూపించారు. ఈ నెల 21న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ ట్రయిలర్ ను మీరూ చూడవచ్చు.

Vikky Koushal
Bhoot
Trailer
Mumbai Costal
New Movie
  • Error fetching data: Network response was not ok

More Telugu News