Amaravati: న్యాయం చేయండి... వెంకయ్యనాయుడుకు అమరావతి రైతుల వేడుకోలు

  • ఢిల్లీలో ఉపరాష్ట్రపతిని కలిసిన జేఏసీ నేతలు
  • పోలీసుల దాడులను వివరించిన రైతులు
  • అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆవేదన

అమరావతి రాజధాని పరిరక్షణ కమిటీ (జేఏసీ) నేతలు, రైతులు ఈరోజు ఉదయం ఢిల్లీలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలుసుకున్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరిగేలా చూడాలని వేడుకున్నారు.

‘రాజధాని నిర్మాణం కోసమని మేము వేలాది ఎకరాల భూములు ఇచ్చాం. ఇప్పుడు రాజధాని మార్పు అంటున్నారు. మేం ఆందోళన వ్యక్తం చేస్తే తప్పుడు కేసులు బనాయించారు. దాడులు చేస్తున్నారు’ అంటూ తమ గోడు వినిపించుకున్నారు. రాజధాని తరలిపోకుండా చూడాలని, తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రాష్ట్రపతి, ఇతర బీజేపీ పెద్దలు, సోనియా, రాహుల్ అపాయింట్ మెంట్ లు కూడా కోరామని, వారిని కూడా కలిసి సమస్య వివరిస్తామని తెలిపారు.

Amaravati
formers JAC
New Delhi
Venkaiah Naidu
  • Loading...

More Telugu News