RRR: వేచి చూడండి... వచ్చేస్తుంది... 'మాహిష్మతి' ప్రజలకు 'ఆర్ఆర్ఆర్' దిమ్మతిరిగే సమాధానం!

  • ఇప్పటివరకూ రాని 'ఆర్ఆర్ఆర్' ఫస్ట్ లుక్
  • ఓ అభిమాని ప్రశ్నపై స్పందించిన 'బాహుబలి' టీమ్
  • మీరు వెయిట్ చేయించలేదా? అంటూ ఆర్ఆర్ఆర్ టీమ్ సమాధానం

న్యూ ఇయర్ వెళ్లిపోయింది, సంక్రాంతి వెళ్లిపోయింది. త్వరలో మహా శివరాత్రి కూడా రానుంది. టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'ఆర్ఆర్ఆర్' అప్ డేట్ మాత్రం రావట్లేదు. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తుండగా, బాహుబలి రెండు భాగాల తరువాత రాజమౌళి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా అప్ డేట్స్, ఫస్ట్ లుక్, టైటిల్ తదితరాల కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో నెట్టింట జరిగిన ఓ మాటల సంభాషణ ఇప్పుడు వైరల్ అవుతోంది. తాను 'మాహిష్మతి' సామ్రాజ్యానికి చెందిన వ్యక్తినని, ఆర్ఆర్ఆర్ ఫస్ట్ లుక్ కోసం ఎదురు చూస్తున్నానని ఓ ఫ్యాన్ పెట్టిన ట్వీట్ కు 'బాహుబలి' టీమ్ స్పందించగా, అందుకు ఆర్ఆర్ఆర్ టీమ్ అదిరిపోయే సమాధానాన్ని ఇచ్చింది.

ఆర్ఆర్ఆర్ టీమ్ నుంచి వచ్చే ఫస్ట్ లుక్ కోసం మా మాహిష్మతి ప్రజలు ఎంతో ఎదురు చూస్తున్నారు. ప్రతి ఫెస్టివల్ కూ శుభాకాంక్షలతో సరిపెడుతున్నారే తప్ప, అప్ డేట్ ఇవ్వడం లేదు. మీ సందేహాలతో మా ప్రజలకు కాలక్షేపం అవుతోంది, డియర్ కెప్టెన్ రాజమౌళి సర్... దయచేసి అప్ డేట్ అవండంటూ బాహుబలి టీమ్ ట్వీట్ చేసింది.

ఇక దీనిపై ఆర్ఆర్ఆర్ టీమ్ స్పందిస్తూ, మీ మాటలు చూస్తే, కిందపడి మరీ దొర్లుతూ నవ్వేలా ఉన్నాయని పంచ్ ఇచ్చింది. ఎవరు దేని గురించి మాట్లాడుతున్నారని ప్రశ్నిస్తూ, మీ అడుగు జాడల్లోనే మేమూ నడుస్తున్నామని పేర్కొంది. 'బాాహుబలి' సమయంలో పోస్టర్లు, ట్రయిలర్ కోసం ఫ్యాన్స్ ఎంత ఎదురు చూశారో తామింకా మరచిపోలేదని, తమ అభిమానులను తామెంతగా ప్రేమిస్తామో, వాళ్లూ అంతలా ప్రేమిస్తారని గుర్తు చేసుకుంది. వాళ్ల అశలను నెరవేరుస్తామన్న సంగతి వాళ్లకు తెలుసునని, త్వరలోనే ఫస్ట్ లుక్ వస్తుందని పేర్కొంది. ఇక ఈ మాటల యుద్ధం నెట్టింట తెగ వైరల్ అవుతుండగా, వందల కొద్దీ లైక్స్, కామెంట్లు వస్తున్నాయి.

  • Error fetching data: Network response was not ok

More Telugu News