Andhra Pradesh: అత్యాచార కేసుల విషయంలో ఆంధ్రప్రదేశ్ దారిలో మహారాష్ట్ర!

  • 'దిశ' చట్టాన్ని పరిశీలిస్తున్నాం
  • మరిన్ని వివరాల కోసం ఏపీలో పర్యటన
  • మహారాష్ట్ర హోమ్ మంత్రి అనిల్ దేశ్ ముఖ్

మహిళలు, బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడేవారికి త్వరితగతిన కఠిన శిక్షలు విధించడమే లక్ష్యంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుని వచ్చిన 'దిశ' చట్టాన్ని మహారాష్ట్రలోనూ అమలు చేయాలని ఉద్ధవ్ సర్కారు భావిస్తోంది. 'దిశ' చట్టం అమలు విషయాన్ని పరిశీలిస్తున్నామని ఆ రాష్ట్ర హోమ్ శాఖా మంత్రి అనిల్‌ దేశ్‌ ముఖ్‌ వెల్లడించారు. తాను త్వరలో ఏపీలో పర్యటించనున్నానని, ఈ చట్టం గురించి మరింత లోతుగా తెలుసుకుంటానని ఆయన చెప్పారు. కాగా, జగన్ సర్కారు అమలులోకి తెచ్చిన 'దిశ' చట్టం ప్రకారం, మహిళలపై అఘాయిత్యాలు జరిగిన మూడు వారాల్లోనే దోషికి శిక్ష పడే అవకాశం ఉంటుంది.

Andhra Pradesh
Maharashtra
Anil Deshmuk
Disha Act
  • Loading...

More Telugu News