Hero Nikhil: కాబోయే భార్య గురించి హీరో నిఖిల్ ట్వీట్!

  • 16న పల్లవిని వివాహమాడనున్న నిఖిల్
  • వైరల్ గా మారిన నిశ్చితార్థం ఫొటోలు
  • తాజాగా మరో ఫొటో...

హీరోగా నటిస్తూ.. సాహస పాత్రలతో అభిమానులను అలరిస్తున్న టాలీవుడ్ యువ హీరో నిఖిల్ త్వరలో ఓ ఇంటివాడవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జీవితంలో సరికొత్త సాహసానికి సిద్ధమవుతున్నట్లు తెలిపాడు. ఏప్రిల్ 16న డాక్టర్ పల్లవి వర్మకు భర్తగా మారనున్నాడు. ఇటీవల వీరిద్దరి మధ్య జరిగిన ఎంగేజ్ మెంట్ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

తాజాగా నిఖిల్ తనకు కాబోయే భార్యతో కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. క్యాప్షన్ గా ‘ఆమె ఓకే చెప్పింది.. జీవితంలో ఇది తదుపరి సాహసం’ అని పేర్కొన్నాడు. గత ఏడాది నవంబర్ లో రిలీజైన ‘అర్జున్ సురవరం’ చిత్రంతో నిఖిల్ మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే.

Hero Nikhil
Tollowood
Engagement
Marriage
  • Loading...

More Telugu News