Delhi Elections: ఆమ్ ఆద్మీ పార్టీ పేరు మార్చుకోవాలి: కపిల్ మిశ్రా

  • ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో ఆప్ ను టార్గెట్ చేస్తున్న బీజేపీ
  • ముస్లిం లీగ్ గా పేరు మార్చుకోవాలన్న కపిల్ మిశ్రా
  • ఇటీవల 48 గంటల పాటు మిశ్రాపై నిషేధం విధించిన ఈసీ

ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీపై బీజేపీ నేతలు విమర్శల దాడిని పెంచారు. ఆప్ తన పేరును ముస్లిం లీగ్ గా మార్చుకోవాలని బీజేపీ నేత కపిల్ మిశ్రా విమర్శించారు. సీఏఏకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలపై ఆప్ అధినేత కేజ్రీవాల్ స్పందించకపోవడంతో ఆయన ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు.

 అఫ్జల్ గురు, బుర్హాన్ వనీ, ఉమర్ ఖలీద్ వంటి వారిని తండ్రిగా భావించేవారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను చూసి భయపడుతున్నారని అన్నారు. మరోవైపు ఇటీవల కపిల్ మిశ్రాను ప్రచార జాబితా నుంచి 48 గంటల పాటు ఈసీ తొలగించింది. ఢిల్లీ ఎన్నికలను ఇండియ వర్సెస్ పాకిస్థాన్ అని పోల్చిన నేపథ్యంలో ఈసీ కన్నెర్ర చేసింది.

Delhi Elections
AAP
BJP
Kapil Mishra
  • Loading...

More Telugu News