Kanna Lakshminarayana: రాజధాని విషయంలో మాది ఒకటే వైఖరి: కన్నా లక్ష్మీనారాయణ

  • విశాఖలో భూదందా కోసమే రాజధాని మార్పు
  • జగన్ తన అసమర్థతను కప్పి పుచ్చుకునేందుకు కేంద్రంపై నిందలు
  • రాష్ట్రంలో అభివృద్ధిని అటకెక్కించారు

ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో తాము తొలి నుంచి ఒకటే వైఖరితో ఉన్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. గుంటూరులోని తన నివాసంలో నిన్న విలేకరులతో మాట్లాడిన ఆయన.. జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జగన్ తన అసమర్థతను కప్పి పుచ్చుకునేందుకే కేంద్రంపై నిందలు వేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధిని అటకెక్కించి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. భూదందా కోసమే రాజధానిని అమరావతి నుంచి విశాఖపట్టణానికి మార్చేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు.

ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కడ పెట్టాలన్నది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని, ఈ విషయంలో కేంద్రానికి ఎటువంటి సంబంధం లేదని కన్నా స్పష్టం చేశారు. విశాఖపట్టణంలో ఆరువేల ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకునేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కన్నా ఆరోపించారు.

Kanna Lakshminarayana
BJP
Andhra Pradesh
Jagan
  • Loading...

More Telugu News