Gas pipe line: తూర్పు గోదావరి జిల్లా ఉప్పుడిలో గ్యాస్ పైప్ లైన్ లీకేజీ!

  • కాట్రేనికోన మండలంలో ఘటన
  • పెద్ద శబ్దంతో గ్యాస్ లీక్
  • భయాందోళనలకు గురైన స్థానికులు

తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన మండలంలోని ఉప్పుడిలో గ్యాస్ పైప్ లైన్ లీకేజీ అయింది. పైప్ లైన్ నుంచి సహజవాయువు భారీగా లీకవుతోంది. గ్యాస్ పైప్ లైన్ లీకైన ప్రాంతం నుంచి కిలోమీటర్ పరిధిలో ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. ఓఎన్జీసీ నిర్వహణ పనుల్లో భాగంగా రిగ్గు వద్ద మరమ్మతులు నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగింది. కాగా, పెద్ద శబ్దంతో గ్యాస్ లీకవడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ సమాచారం మేరకు అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకున్నట్టు సమాచారం. కాట్రేనికోనలో ప్రధాన రహదారిపై రాకపోకలను అధికారులు నిలిపివేశారు.

Gas pipe line
leak
East Godavari District
Uppudi
  • Loading...

More Telugu News