cricket: టీమిండియా, కివీస్ ఆటగాళ్ల మధ్య స్నేహానికి ఈ ఫొటోనే నిదర్శనం!

  • చివరి టి20లో ఆడని కోహ్లీ, విలియమ్సన్
  • బౌండరీ లైన్ వద్ద కబుర్లు
  • క్లిక్ మనిపించిన కెమెరామన్

టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య మౌంట్ మాంగనుయ్ లో జరిగిన చివరి టి20 మ్యాచ్ లో ఆసక్తికర దృశ్యం ఆవిష్కృతమైంది. ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, కివీస్ సారథి కేన్ విలియమ్సన్ బౌండరీ బయట కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. ఈ మ్యాచ్ కు దూరమైన ఇద్దరూ ప్రత్యర్థుల్లా కాకుండా మిత్రుల్లా కబుర్లు చెప్పుకుంటూ కనిపించడం భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఉన్న స్నేహబంధానికి నిదర్శనంలా నిలిచింది. సాధారణంగా కివీస్ ఆటగాళ్లు ఎంతో సౌమ్యంగా ఉంటారని ప్రతీతి.

ఈ సిరీస్ కు ముందు కోహ్లీ మాట్లాడుతూ, వరల్డ్ కప్ లో ఓటమిని ఆ మ్యాచ్ వరకే పరిమితం చేశామని, ఇప్పుడు కివీస్ పై ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచనే రాదని, కివీస్ ఆటగాళ్లు చాలా మంచివాళ్లని కితాబిచ్చాడు. ఇప్పుడు మౌంట్ మాంగనుయ్ మ్యాచ్ లో కేన్ విలియమ్సన్ బౌండరీ లైన్ వద్ద అడ్వర్టయిజ్ మెంట్ బోర్డుకు ఆనుకుని కూర్చుని ఉండగా, అటూఇటూ విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ కూర్చుని మాట్లాడుకుంటుండగా ఓ మీడియా కెమెరామన్ ఫొటో తీశాడు.

cricket
Spirit
Team India
Team New Zealand
Mount Manganui
  • Loading...

More Telugu News