Kommareddy Surenderreddy: మాజీ మంత్రి కొమ్మారెడ్డి సురేందర్ రెడ్డి కన్నుమూత

  • ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా పనిచేసిన కొమ్మారెడ్డి
  • దీర్ఘకాలిక వ్యాధితో మృతి
  • సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్

నాడు ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా పనిచేసిన తెలంగాణ నేత కొమ్మారెడ్డి సురేందర్ రెడ్డి మృతి చెందారు. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న ఆయన యశోదా ఆసుపత్రిలో అనారోగ్యానికి చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో మరణించారు. కొంతకాలంగా ఆయన మాదాపూర్ లోని తన కుమార్తె నివాసంలో ఉంటున్నారు. అప్పట్లో మేడ్చెల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది అటవీశాఖ మంత్రిగా పనిచేశారు. సురేందర్ రెడ్డి మృతి పట్ల టీడీపీ, ఇతర పార్టీల నేతలు సంతాపం తెలియజేశారు. సురేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులు విదేశాల్లో ఉండడంతో అంత్యక్రియలు రేపు నిర్వహించనున్నారు. కొమ్మారెడ్డి మృతికి సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు సంతాపం తెలిపారు.

Kommareddy Surenderreddy
Telugudesam
Telugudesam
Medchal
MLA
Minister
NTR
KCR
  • Loading...

More Telugu News