Darshan: బాయ్ ఫ్రెండ్ తో గడిపిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలా?... సనమ్ శెట్టిపై నటుడు దర్శన్ సంచలన ఆరోపణలు!

  • మేలో దర్శన్, సనమ్ నిశ్చితార్థం
  • జూన్ లో జరగాల్సిన వివాహం వాయిదా
  • ఇప్పుడు ఒకరిపై ఒకరి ఆరోపణలు

తమిళ నటుడు దర్శన్, నటి సనమ్ శెట్టిలకు నిశ్చితార్థం జరిగి, అది రద్దుకాగా, ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణలతో కోలీవుడ్ లో పెద్ద రచ్చ జరుగుతోంది. ఓ చిత్రంలో నటిస్తున్న వేళ, ఇద్దరి మధ్యా ప్రేమ పుట్టగా, గత సంవత్సరం మేలో ఇద్దరికీ ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది. ఆ తరువాత బిగ్ బాస్ రియాల్టీ షోలో దర్శన్ పాల్గొనడంతో, అతనికి మరింత పాప్యులారిటీ వచ్చింది. షో నుంచి బయటకు వచ్చిన తరవాత ఇద్దరి మధ్యా ఏం జరిగిందో తెలియదుగానీ, సనమ్ శెట్టి, చెన్నై పోలీసు కమిషనర్ ను కలిసి దర్శన్ పై ఫిర్యాదు చేసింది.

బిగ్ బాస్ గేమ్ షోలో పాల్గొనే అవకాశం రావడంతో జూన్ లో జరగాల్సిన తమ వివాహాన్ని కొన్నాళ్లు వాయిదా వేసుకోవాలని నిర్ణయించుకున్నామని, దర్శన్ కు పేరు రావడానికి కారణం తానేనని చెప్పింది. దర్శన్ కోసం ఎంతో డబ్బు ఖర్చు చేశానని, అయితే, అతను మారిపోయాడని ఆమె ఆరోపించింది. ఈ విషయంలో దర్శన్ తల్లిదండ్రులను సంప్రదిస్తే, అప్పుడు నీపై ప్రేమ ఉందని, ఇప్పుడు లేదని చెబుతూ, తనను గెంటేశారని వాపోయింది. దర్శన్ తనకు నమ్మకద్రోహం చేశాడంటూ ఫిర్యాదు చేసింది.

ఇక సనమ్ ఆరోపణలపై స్పందించేందుకు దర్శన్ మీడియా ముందుకు వచ్చాడు. ఇటీవల తన బాయ్ ఫ్రెండ్ తో సనమ్ గడిపిందని సంచలన ఆరోపణలు చేశాడు. ఒక రాత్రంతా ఫ్రెండ్ తో ఉన్న ఆమెను తానెలా వివాహం చేసుకుంటానని ప్రశ్నించాడు. ఆమెను పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని కుండ బద్ధలు కొట్టాడు. వీరిద్దరి ప్రేమ, నిశ్చితార్థం, అది రద్దు కావడం, ఇప్పుడు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణలు పెను చర్చకు దారితీశాయి.

Darshan
Sanam Shetty
Engagement
Cancel
Kollywood
  • Loading...

More Telugu News