: బీసీసీఐ 'సహ'కరించాల్సిందే: కేంద్రమంత్రి మాకెన్
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) పరిధిలోకి వచ్చేందుకు సమ్మతి తెలపాలని కేంద్ర మంత్రి అజయ్ మాకెన్ సూచించారు. దేశం పేరిట జాతీయ జట్టును ఎంపిక చేస్తున్న ఏ క్రీడాసంఘం కూడా ప్రైవేటు సంఘం కాజాలదని మాకెన్ అన్నారు. స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో బీసీసీఐ.. ఆర్టీఐ పట్ల అపోహలు వీడాలని సలహా ఇచ్చారు. గతంలో క్రీడల శాఖ మంత్రిగా పనిచేసిన మాకెన్ అప్పట్లో క్రీడాసంఘాల్లో పారదర్శకతను పెంపొందించేందుకు పలు చర్యలు తీసుకున్నారు. అందుకోసమని క్రీడాబిల్లును కూడా ప్రవేశపెట్టారు. కానీ, ఈ బిల్లుపై క్యాబినెట్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.