Union Budget 2020: పన్ను ఎగవేతను క్రిమినల్ నేరం పరిధి నుంచి తప్పిస్తామన్న నిర్మలా సీతారామన్!

  • పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
  • పన్నుల విధానం మరింత సరళతరం
  • పన్ను చెల్లింపుదారులకు వేధింపులు ఉండవని వెల్లడి

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగంలో భాగంగా పన్నుల విధానంపై వివరాలు తెలిపారు. పన్ను చెల్లింపుదారులకు వేధింపులు ఉండవని స్పష్టం చేశారు. పన్ను ఎగవేతను క్రిమినల్ నేరంగా పరిగణించే విధానానికి స్వస్తి పలికే దిశగా చట్ట సవరణ చేస్తామని తెలిపారు. వ్యక్తిగతంగా పన్నులు చెల్లించే విధానం మరింత సరళతరం చేస్తున్నట్టు వెల్లడించారు. కొత్త విధానం ప్రకారం ఆదాయం ఎంతో వెల్లడించి ఈ మేరకు పన్ను చెల్లిస్తే చాలని వివరించారు.

అయితే పాత పన్నుల విధానం కూడా అమల్లో ఉంటుంది. పన్ను చెల్లింపుదారులు రెండింట్లో ఏదో ఒక విధానాన్ని ఎంపిక చేసుకుని పన్నులు చెల్లించవచ్చు. పాత విధానంలో ఉన్న మినహాయింపులు మున్ముందు కూడా అమల్లో ఉంటాయి. అయితే, కొత్త విధానం ఎంచుకుంటే 80 (సి) కింద వచ్చే మినహాయింపులు దక్కవు. పాత పన్నుల విధానంలో 4 శ్లాబులు ఉండగా, కొత్త విధానంలో 7 శ్లాబులు ఉన్న సంగతి తెలిసిందే.

Union Budget 2020
Nirmala Sitharaman
Tax
Tax Payers
Criminal
  • Loading...

More Telugu News