Nirbhaya: నిర్భయ దోషి క్షమాభిక్ష పిటిషన్ ను తిరస్కరించిన రాష్ట్రపతి

  • క్షమాభిక్ష పెట్టుకున్న వినయ్ శర్మ
  • రాష్ట్రపతి తిరస్కరించారని ప్రకటించిన కేంద్ర హోం శాఖ
  • ఉరితీతను వాయిదా వేయించేందుకు పలు పిటిషన్లు వేస్తున్న దోషులు

నిర్భయ దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించారు. ఈ విషయాన్ని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. నిర్భయ గ్యాంగ్ రేప్ కు సంబంధించి క్షమాభిక్షను రాష్ట్రపతి తిరస్కరించడం ఇది రెండో సారి. వాస్తవానికి ఈ ఉదయం 6 గంటలకు నిర్భయ దోషులు అక్షయ్ కుమార్, ముఖేశ్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మలకు ఉరిశిక్షను అమలు చేయాల్సి ఉంది. కానీ, ఉరిశిక్షను వాయిదా వేయించేందుకు వీరు కోర్టుల్లో పలు పిటిషన్లు వేస్తున్నారు. రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకునేందుకు ఇంకా ఇద్దరు దోషులకు అవకాశం ఉంది.

Nirbhaya
Nirbhaya Convitct
Mercy Petition
President Of India
Ram Nath Kovind
  • Loading...

More Telugu News