prashanth kishore: జేడీఎస్‌లోకి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్?

  • ప్రశాంత్ కిశోర్‌ను బహిష్కరించిన జేడీయూ
  • త్వరలోనే కుమారస్వామితో ప్రశాంత్ కిశోర్ చర్చలు
  • జాతీయ రాజకీయాల్లో ఇప్పుడిదే చర్చ

జేడీయూ నుంచి బహిష్కరణకు గురైన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ త్వరలో జేడీఎస్‌లో చేరనున్నట్టు తెలుస్తోంది. 2018లో జరిగిన కర్ణాటక ఎన్నికల సమయంలో ప్రశాంత్ కిశోర్ సలహాలు తీసుకుందామని జేడీఎస్ నేతలు ప్రతిపాదించినప్పటికీ, కుమారస్వామి మాత్రం అంగీకరించలేదని సమాచారం. తాజాగా, జేడీయూ నుంచి సస్పెండ్ కావడంతో జేడీఎస్ వైపు ప్రశాంత్ కిశోర్ దృష్టి సారించినట్టు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే కుమారస్వామిని కలిసి ఈ విషయమై చర్చించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఈ విషయం చర్చనీయాంశం కాగా, ఈ విషయమై అటు దేవెగౌడ కానీ, ఇటు కుమారస్వామి కానీ ఎటువంటి ప్రకటన చేయలేదు.

prashanth kishore
JDU
JDS
  • Loading...

More Telugu News