JC Diwakar Reddy: ఏపీ ప్రభుత్వం పగతో రగిలిపోతోంది: జేసీ దివాకర్ రెడ్డి

  • ‘త్రిశూల్ సిమెంట్’ లీజును రద్దు చేసిన ప్రభుత్వం 
  • రాష్ట్రానికి జరిగిన నష్టంతో పోలిస్తే.. ఇదెంత?
  • నాకేమీ బాధలేదు.. కోర్టుకు వెళతా అన్న జేసీ

తన కుటుంబానికి చెందిన ‘త్రిశూల్ సిమెంట్’ కంపెనీ లీజును రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడంపై టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఏపీ ప్రభుత్వం పగతో రగిలిపోతోందన్నారు. రాష్ట్రానికి జరిగిన నష్టంతో పోల్చితే.. ఇదెంత?.. నాకేమీ బాధలేదని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని కోర్టులో తేల్చుకుంటానని జేసీ అన్నారు.

"ఎవరూ చనిపోకపోతే వారిపై ‘పగపగ’ అన్నట్లు ప్రభుత్వం తీరు ఉంటోంది. చంపిన తర్వాత వాళ్ల ఆర్థిక మూలాలు దెబ్బతిని భార్యా పిల్లలు అడుక్కుతింటే చూసి ఇగో శాంతిస్తుంది, ఇదే ఫ్యాక్షనిజం" అని జేసీ చెప్పుకొచ్చారు. ఇప్పటికే దివాకర్ ట్రావెల్స్ బస్సులపై  వైసీపీ సర్కారు ఆంక్షల కొరడా ఝళిపించిన విషయం తెలిసిందే.

JC Diwakar Reddy
Telugudesam
Trishul cements
Lease
Cancellation
  • Loading...

More Telugu News