Radha saptami: రేపు రథసప్తమి.. ముస్తాబైన అరసవల్లి ఆలయం

  • భక్తుల కోసం ఆలయంలో ఏర్పాట్లు
  • ఇవాళ అర్థరాత్రి నుంచి స్వామి వారికి ప్రత్యేక పూజలు
  • రేపు సూర్య నారాయణస్వామి నిజరూప దర్శనం 

రేపు రథసప్తమిని పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ రోజు అర్ధరాత్రి నుంచి రేపు సాయంత్రం నాలుగు గంటల వరకు సూర్య జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఇవాళ అర్ధరాత్రి 12 గంటల నుంచి రేపు ఉదయం 7 గంటల వరకు స్వామి వారికి క్షీరాభిషేకం నిర్వహించనున్నారు. అనంతరం భక్తులకు స్వామి వారి నిజరూప దర్శనం కల్పించనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. ఏపీ నుంచే కాకుండా సమీప రాష్ట్రాల భక్తులు సైతం సూర్యభగవానుడి దర్శనం కోసం అక్కడికి చేరుకున్నారు. కాగా, సూర్యుడు మకర రాశి ప్రవేశం చేయడాన్ని రథ సప్తమిగా చెబుతారు.

Radha saptami
Srikakulam District
Arasavilli
Temple
  • Loading...

More Telugu News