Nirbhaya: నిర్భయ దోషులకు ఉరిశిక్ష మరోసారి వాయిదా!

  • ఫిబ్రవరి 1న ఉరికి సన్నాహాలు
  • డెత్ వారెంట్లపై స్టే ఇచ్చిన పాటియాలా హౌస్ న్యాయస్థానం
  • తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఉరి వాయిదా

నిర్భయ దోషులను ఫిబ్రవరి 1న ఉరి తీసేందుకు సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో పాటియాలా హౌస్ కోర్టు డెత్ వారెంట్లపై స్టే ఇచ్చింది. దాంతో నలుగురు దోషులకు ఉరిశిక్ష మరోసారి వాయిదా పడింది. తొలుత జనవరి 22న ఉరి తీయాలని భావించగా, అది ఫిబ్రవరి 1కి మారింది. ఇప్పుడది కూడా వాయిదా పడింది.

తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఉరి వాయిదా వేయాలని పాటియాలా హౌస్ కోర్టు ఆదేశించింది. ఈ మేరకు అదనపు సెషన్స్ జడ్జి ధర్మేందర్ రాణా తీర్పు వెలువరించారు. దోషులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం, తమకు ఇంకా న్యాయపరమైన అవకాశాలు ఉన్నందున స్టే ఇవ్వాలన్న దోషుల వాదనలతో ఏకీభవించింది. నిర్భయ కేసులో జనవరి 22న ఉరి తీయాలని ఒకసారి, ఫిబ్రవరి 1న ఉరితీయాలని మరోసారి కోర్టు డెత్ వారెంట్లు జారీ చేయడం, రెండుసార్లు స్టే ఇవ్వడం తెలిసిందే.

Nirbhaya
Hang
Death
Stay
Patiala House Court
  • Loading...

More Telugu News